అమెరికాలో H-1B వీసా హోల్డర్లకు మరో ఇబ్బంది ఎదురవ్వనుంది. ఉద్యోగం కోల్పోయిన విదేశీ కార్మికులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను తొలగించే ప్రతిపాదనను US హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ పరిశీలిస్తోంది. ఈ నియమం అమల్లోకి వస్తే నిరుద్యోగులైన వీసా హోల్డర్లు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. 2024లో మంజూరైన H-1B పిటిషన్లలో 71 శాతం భారతీయులకే దక్కడం గమనార్హం.
ట్రంప్ H-1B వీసా హోల్డర్లకు మరో షాక్ ఇవ్వనున్నారా?
Source: Gulte Telugu