హైదరాబాద్లో పేదలకు సొంతిళ్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ప్రాజెక్టుకు గురువారం కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. మొదటి విడతలో 16 నియోజకవర్గాల్లోని 18 ప్రదేశాల్లో 7,340 ఫ్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వం రూ.807.40 కోట్ల అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో ఫ్లాట్కు రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు.
హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్లకు సీఎం రేవంత్ భూమిపూజ
Source: News18 Telugu