భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ప్రత్యేక విమానాలు ల్యాండ్ అయ్యాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ఢిల్లీ నుంచి సొంత విమానంలో చేరుకున్నారు. మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావులు మరో ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆగస్టు 17 నుంచి ఇక్కడి నుంచి రెగ్యులర్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
భోగాపురంలో ప్రత్యేక విమానాల సందడి.. ఎంపీ, ఎమ్మెల్యేల రాక
Source: Samayam Telugu