బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి పశ్చిమ బెంగాల్ తీరం దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆగస్టు 13 నుంచి 18 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక
Source: Asianet Telugu