స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL కొత్త వినియోగదారులకు రూ.1కే సిమ్, ఉచిత ఫస్ట్ రీఛార్జ్ అందించే 'ఫ్రీడమ్ 2.0' ప్లాన్ను తీసుకొచ్చింది. 24 రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS, 1GB డేటా లభిస్తాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, రూ.2,399 వార్షిక ప్లాన్పై అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ బోనస్ ప్రకటించింది.
BSNL ఫ్రీడమ్ 2.0: రూ.1కే సిమ్, ఉచిత ఫస్ట్ రీఛార్జ్
Source: Zee Telugu News