కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 17న దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది. కనీస పెన్షన్ రూ.7,500కు పెంచడం, ESI వేతన పరిమితిని రూ.42,000కు, EPF పరిమితిని రూ.30,000కు పెంచడం ప్రధాన డిమాండ్లు. రాంచీలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 17న దేశవ్యాప్త నిరసనలకు బీఎంఎస్ పిలుపు
Source: HMTV