అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3) ఖర్చుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఖండించింది. కిలోమీటరుకు రూ.174 కోట్లు ఖర్చైందన్న వార్తలు అవాస్తవమని, వాస్తవానికి కిలోమీటరుకు సుమారు రూ.69.7 కోట్లు మాత్రమే అవుతుందని స్పష్టం చేసింది. 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారి, బీఆర్టీఎస్ కారిడార్, సర్వీసు రోడ్లతో ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపింది.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు కి.మీ.కు రూ.69.7 కోట్లే: ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్
Source: Samayam Telugu