తెలంగాణ జానపద నృత్యకారిణి నాగదుర్గ తెలుగులో రెండో సినిమా 'శనార్తి' ప్రారంభించింది. ఈ చిత్రంలో 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేమ్ అఖిల్ రాజ్ హీరోగా నటిస్తున్నారు. సంపత్ నంది టీమ్ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజ్ గణేష్ ఉప్పునూతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో ఈ ప్రేమకథ రూపొందుతోంది.
నాగదుర్గ రెండో సినిమా 'శనార్తి' ప్రారంభం
Source: Asianet Telugu