స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ. 5,000 నగదు బహుమతి ఇస్తున్నారనే వార్తలు అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇది సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకు వివరాలను దొంగిలించేందుకు పన్నిన పన్నాగమని హెచ్చరించింది. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని, అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధ్రువీకరించుకోవాలని కేంద్రం సూచించింది.
మోదీ రూ. 5,000 నగదు బహుమతి వార్తలు ఫేక్.. పీఐబీ క్లారిటీ
Source: Vaartha