శనివారం ఉదయం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా కొద్దిసేపు నిలిచిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఫిర్యాదు చేయడంతో ఖాతాను పునరుద్ధరించినట్టు తెలిపారు. ఇంతకుముందు కూడా సీజేపీ సోషల్ మీడియా ఖాతాను కేంద్రం నిషేధించిన విషయం గమనార్హం.
సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా మరోసారి నిలిచిపోవడంపై అభిజిత్ దీప్కే ఆగ్రహం
Source: Mana Telangana