ఆంధ్ర క్రికెట్ సంఘం మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ను సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు మంగళగిరిలో నిర్వహించనుంది. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీ 4 జట్లతో ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీసేందుకు ఇది ఒక వేదికగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్ర మహిళల ప్రీమియర్ లీగ్‌కు షెడ్యూల్ విడుదల
Source: Zee Telugu News