ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చేసిన 'దిమాగీ నక్సల్' వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో 'దిమాగీ నక్సల్ జనతా పార్టీ' పేరుతో వ్యంగ్య ఖాతాలు వెలిశాయి. ఒక్క రోజులోనే లక్ష మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ ఖాతా ప్రముఖులను ఫాలో అవుతోంది. కాంగ్రెస్ నేత చిదంబరం తాను 'దిమాగీ నక్సల్'నని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానన్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షాలను ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు.
దిమాగీ నక్సల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యంగ్య అకౌంట్లు
Source: Vaartha