వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చేసిన ఆరుగురు కస్టమర్లు ఆహారం అందించడంలో ఆలస్యమైనందుకు ఆగ్రహంతో ఫర్నిచర్, కంప్యూటర్, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న మహిళలు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు.
బిర్యానీ ఆలస్యంపై ఆగ్రహం.. రెస్టారెంట్లో వీరంగం
Source: Vaartha