యువ హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్లో ఆయన పాత్ర పేరు మారుతి అని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఆగస్టు 23న విడుదల కానుంది. అలాగే, షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సంగీత్ శోభన్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ సినిమా ప్రకటించారు.
సంగీత్ శోభన్కు రెండు కొత్త సినిమాల ప్రకటన
Source: Gulte Telugu