ఏపీ అసెంబ్లీలో గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సీఎం చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వం కోర్టును మభ్యపెట్టేందుకు ఏపీపీఎస్సీ అధికారులు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపించారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడం అనుమానాలకు తావిచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆధారాలతో వివరించారు. పారదర్శక నియామకాలే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని స్పష్టం చేశారు.
గ్రూప్-1 అక్రమాలపై చంద్రబాబు ప్రజెంటేషన్
Source: Vaartha