భారత్-జపాన్ మధ్య రక్షణ సంబంధాలు బలపడుతున్నాయి. సెప్టెంబర్లో జరగనున్న ‘వీర్ గార్డియన్’ వైమానిక విన్యాసాల్లో జపాన్ యుద్ధ విమానాలు తొలిసారిగా భారత్లో పాల్గొంటాయి. ఇరు దేశాల రక్షణాధికారులు న్యూఢిల్లీలో సమావేశమై వ్యూహాత్మక ప్రణాళికపై చర్చించారు. ఆధునిక సాంకేతికత, మానవరహిత వ్యవస్థలతో విన్యాసాలను మరింత సంక్లిష్టంగా నిర్వహించాలని నిర్ణయించారు.
సెప్టెంబర్లో భారత్-జపాన్ వీర్ గార్డియన్ విన్యాసాలు
Source: Vaartha