కాకినాడలోని SK నర్సింగ్ కళాశాలలో మొబైల్ ఫోన్ పోయిన విషయంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు, స్థానిక విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్షించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని విద్యార్థులను విడివిడిగా ఉంచి భద్రత కల్పించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
కాకినాడ నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ సీఎం దృష్టికి
Source: Gulte Telugu