హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లుగా మరో 12 నెలల పాటు కొనసాగించేలా ట్రంప్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసింది. గతేడాది సెప్టెంబరులో విధించిన ఈ పెంపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. దీనివల్ల ఐటీ ఔట్‌సోర్సింగ్ కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు 92 శాతం తగ్గాయని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఈ ఫీజును 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో సవాలు చేయగా, అది చట్టవిరుద్ధమని తీర్పు వచ్చింది.
హెచ్-1బీ లక్ష డాలర్ల ఫీజుకు మరో ఏడాది పొడిగింపు
Source: telugutimes.net