ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో తెలిపారు. సాగు, తాగునీరు, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్రం తక్షణమే రూ.20 వేల కోట్లు విడుదల చేయాలని, కేంద్ర బృందాన్ని పంపాలని తీర్మానం ప్రవేశపెట్టారు. ఉపాధి హామీ పనిదినాలు 50 రోజులు పెంచాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కోరారు.
తెలంగాణకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: భట్టి విక్రమార్క
Source: Vaartha