అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త కార్యనిర్వాహక ఆదేశం జారీ చేశారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి విదేశీ కార్మికులను నియమించే కంపెనీలపై ప్రభుత్వ శాఖలు కఠినంగా దర్యాప్తు చేసి జరిమానాలు విధిస్తాయి. గత ఏడాది దరఖాస్తులను సైతం పునఃపరిశీలిస్తారు. కొత్త హెచ్-1బీ దరఖాస్తులపై ఒక లక్ష డాలర్ల రుసుమును సెప్టెంబర్ 2027 వరకు పొడిగించారు.
హెచ్-1బీ వీసాపై ట్రంప్ కొత్త కఠిన ఆదేశాలు
Source: Gulte Telugu