కొప్పర్తి-కడప 4 లేన్ల రోడ్డుకు కేంద్రం ఆమోదం

కొప్పర్తి-కడప 4 లేన్ల రోడ్డుకు కేంద్రం ఆమోదం

కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కడప బైపాస్ రోడ్డు వరకు 5.8 కిలోమీటర్ల నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.304 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 'ఎక్స్' వేదికగా ప్రకటించారు. విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో కొప్పర్తి ప్రధాన నోడ్ కావడంతో, ఈ రహదారి సరుకు రవాణా వేగాన్ని పెంచి కడప ప్రాంత పారిశ్రామిక వృద్ధికి ఊతమిస్తుంది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies