దుబాయ్ నుంచి కడపకు ఇండిగో ప్రత్యక్ష విమాన సర్వీసు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో వ్యాప్తవుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కడప విమానాశ్రయ డైరెక్టర్ సుజిత్ కుమార్ పొద్దార్ స్పష్టం చేశారు. ఇండిగో సంస్థగానీ, ఇతర విమానయాన సంస్థలు గానీ ఈ మార్గంపై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులకు విమానాశ్రయ హోదా, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలు, కేంద్ర అనుమతులు తప్పనిసరి కావడంతో, ధృవీకరించని ప్రచారాలను నమ్మి టికెట్లు బుక్ చేసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దుబాయ్-కడప ఇండిగో విమాన సర్వీసు పుకారు: అధికారుల ఖండన
Source: Vaartha