హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఈ ఏడాది సెప్టెంబర్ 25న అనంత చతుర్దశి రోజున హుస్సేన్ సాగర్‌లో జరగనుంది. ఈసారి ఉత్సవాలు సాధారణంగా 11 రోజులకు బదులు 12 రోజుల పాటు కొనసాగనున్నాయి. దీంతో భక్తులకు మహాగణపతిని దర్శించుకునేందుకు ఒక రోజు అదనంగా అవకాశం లభించనుంది. నిమజ్జన ఊరేగింపు నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టనున్నారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం సెప్టెంబర్ 25న
Source: Vaartha