బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23 నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలోకి చేరుకుంటుందని అంచనా. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులు భారీ వర్షాలు
Source: Asianet Telugu