ఆల్కహాల్ సేవించిన తర్వాత పెయిన్‌కిల్లర్స్ వంటి మందులు వేసుకోవడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్, మందులు రెండూ కాలేయం ద్వారా ప్రాసెస్ అవడంతో కాలేయంపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల వికారం, మగత, శ్వాస ఇబ్బంది, అంతర్గత రక్తస్రావం వంటి తీవ్ర సమస్యలు రావచ్చు. ముఖ్యంగా బీపీ, డయాబెటిస్ మందులు వాడేవారు అధిక జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.
ఆల్కహాల్ తర్వాత మందులు వేసుకోవద్దు: వైద్యుల హెచ్చరిక
Source: Asianet Telugu