వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. దేవుళ్లపై అభ్యంతరకర వీడియోలు, మత భావాలను దెబ్బతీసిన కేసుల్లో యూఏపీఏ, దేశద్రోహం సెక్షన్లు కూడా పోలీసులు జోడించారు. విచారణలో తాను అనవసరంగా సున్నిత అంశాలపై దృష్టి పెట్టానని, తప్పు చేశానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆదాయం, నిధుల వివరాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో పోలీసులు ఆర్థిక లింకులను పరిశీలిస్తున్నారు.
ప్రశ్న రావణ్ అరెస్ట్: పోలీసు విచారణలో పశ్చాత్తాపం
Source: Gulte Telugu