బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో రాగల కొన్ని రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సమాయత్తం చేసింది. తీర, లోతట్టు ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, పునరావాస కేంద్రాలు, అత్యవసర సేవల ఏర్పాట్లు చేయాలని హోమ్‌మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రౌండ్ ది క్లాక్ కంట్రోల్ రూమ్‌లు అందుబాటులోకి తెచ్చారు.
ఏపీలో అతిభారీ వర్షాల హెచ్చరిక.. ప్రభుత్వం అలర్ట్
Source: Vaartha