ఒంటారియోలోని బెల్లెవిల్‌లో యోమ్ కిప్పూర్ సందర్భంగా సన్స్ ఆఫ్ జాకబ్ సినగాగ్ బయట విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై 29 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఎదురుకాల్పుల్లో నిందితుడు సీన్ వార్డ్‌కు ప్రాణాపాయ గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ జెఫ్ స్మిత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రార్థనా మందిరంలో ఉన్న 24 మంది సురక్షితంగా ఉన్నారు. ద్వేషపూరిత నేరంగా పరిగణించాలా అన్నది దర్యాప్తులో ఉంది.
కెనడాలో యూదుల ప్రార్థనా మందిరంపై కాల్పులు.. పోలీసు కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
Source: Telugu Post