బీహార్‌లో పదో తరగతి చదువుతున్న బాలికను పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడి శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. పోలీసులు ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేయగా, ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై జేడీయూ మంత్రి శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత రాజేసాయి.
బీహార్‌లో పదో తరగతి విద్యార్థినిపై వేధింపులు, రాజకీయ దుమారం
Source: Vaartha