ఏపీ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగవంతమైందని, త్వరలోనే అసలు సూత్రధారులు, పెద్ద చేపలు జైలుకెళ్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హెచ్చరించారు. రాజమండ్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు పక్కనపెట్టి నగదు రూపంలో వేల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవస్థీకృత దోపిడీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే సాగిందని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.
మద్యం కుంభకోణంలో పెద్ద చేపలు జైలుకెళ్తాయి: బీజేపీ
Source: Vaartha