విడుదలకు ముందే చక్కోర – లూనార్ లవ్ బర్డ్ చిత్రం ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను శ్రీ లక్ష్మీ పిక్చర్స్ ప్రీమియం ధరకు కొనుగోలు చేసింది. డాక్టర్ చింతాడ హేమరావు నిర్మించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేట్రికల్ హక్కుల అమ్మకంతోనే టేబుల్ ప్రాఫిట్ సాధించినట్లు నిర్మాత తెలిపారు. టీ-సిరీస్ సంగీత హక్కులను సొంతం చేసుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
చక్కోర – లూనార్ లవ్ బర్డ్ ప్రపంచ హక్కులు శ్రీ లక్ష్మీ పిక్చర్స్‌కు
Source: Telugu Bulletin