తెలంగాణ ప్రభుత్వ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. 2023-24లో రోజుకు సగటున 29.42 లక్షల మంది ప్రయాణించగా, 2026-27 నాటికి అది 37.09 లక్షలకు పెరిగిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు రూ. 2,428 కోట్లు ఆదా అయ్యాయి. పెరిగిన రద్దీని అధిగమించేందుకు బస్సుల సంఖ్య పెంచుతూ కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు.
మహాలక్ష్మి ప్రయాణాలు ఆల్ టైమ్ రికార్డ్: ఆర్టీసీ ఎండీ
Source: Vaartha