టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో TANTEX, TIPS సంయుక్తంగా నిర్వహించిన సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతంగా జరిగింది. సెప్టెంబర్ 12న Rejoice Lutheran Churchలో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు జరిగిన ఈ శిబిరంలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ తదితర విభాగాల నిపుణులు ఉచిత వైద్య సలహాలు అందించారు. కమ్యూనిటీ సభ్యుల నుంచి విశేష స్పందన లభించగా, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్ హాజరై నిర్వాహకులను అభినందించారు.
ఫ్రిస్కోలో సుఖీభవ ఉచిత ఆరోగ్య శిబిరం విజయవంతం
Source: telugutimes.net