ఏపీలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ సర్వర్లు, స్విచ్‌లు, రౌటర్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ సిస్కో ఇండియా ఎండీ హరీష్ కృష్ణన్‌ను కోరారు. విశాఖపట్నంలో ఇంజనీరింగ్ సెంటర్ లేదా జీసీసీ ఏర్పాటుపైనా చర్చించారు. డేటా సెంటర్ వాల్యూ చైన్ మొత్తం రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సిస్కో ప్రతిపాదనలను పరిశీలిస్తామని హరీష్ కృష్ణన్ తెలిపారు.
ఏపీలో సిస్కో తయారీ కేంద్రం, విశాఖలో ఇంజనీరింగ్ సెంటర్ ప్రతిపాదన
Source: telugutimes.net