హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 1991లో ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఆయన సేవలను భావితరాలకు అందించే సంకల్పంతో ఈ విగ్రహం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు సంతకం చేసిన మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Source: telugutimes.net