తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను టీటీడీ ఖండించింది. ఆన్‌లైన్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తోందని, 2.69 లక్షల టికెట్ల కోటాకు డిమాండ్ దాదాపు 9 రెట్లు ఎక్కువగా ఉందని తెలిపింది. ఒకేసారి సుమారు 6 లక్షల మంది యూజర్లు ప్రయత్నిస్తున్నారని, వర్చువల్ క్యూ విధానంతో రద్దీని నియంత్రిస్తున్నామని వివరించింది.
రూ.300 టికెట్లపై టీటీడీ స్పష్టత, అసత్య ప్రచారాలు వద్దు
Source: telugutimes.net