పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ నుంచి సీనియర్ నటి జరీనా వహాబ్ పోషిస్తున్న జుబేదా పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యాయి. ఆకలి, పేదరికం, జీవన పోరాటాన్ని చిత్రించిన ఈ గ్లింప్స్ భావోద్వేగంగా సాగింది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, టబు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
స్లమ్‌డాగ్ నుంచి జరీనా వహాబ్ జుబేదా గ్లింప్స్ విడుదల
Source: Chitrajyothy