ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఆర్కా మీడియా వర్క్స్ నిర్మిస్తున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్, యమదొంగలోని పులి నుంచి తారకగా మారే ఐకానిక్ సీన్‌ను వేదికపై రీక్రియేట్ చేయించారు. చిన్నారి సారా మ్యాజిక్ ట్రిక్‌తో పులి బొమ్మను ఎన్టీఆర్‌గా మార్చిన సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ-రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ
Source: Chitrajyothy