బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల సభలో తీవ్ర విమర్శలు చేశారు. హైటెక్ సిటీ పక్కనే ఫైవ్ స్టార్ హోటళ్లు, వేల కోట్ల ప్రాపర్టీలు కేటీఆర్ దక్కించుకున్నారని ఆరోపించారు. ఆస్తుల వివరాలను అసెంబ్లీలో ఎందుకు బయటపెట్టలేదనే ప్రశ్నకు, ఇంకా 'పార్ట్-2' విచారణ మిగిలే ఉందని సమాధానమిచ్చారు. త్వరలో ఆధారాలతో సహా చిట్టా బయటపెడతామని హెచ్చరించారు.
కేటీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Source: Vaartha