తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మిత్రపక్షాలతో సంప్రదింపులు జరపకపోవడం సరైన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయంపై వామపక్ష భాగస్వామ్య పక్షాలతో అత్యవసరంగా చర్చలు జరపనున్నట్లు, తమ వ్యూహాన్ని త్వరలో ఖరారు చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంపై సీపీఐ అభ్యంతరం
Source: Vaartha