బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రణ్యారావుకు కస్టమ్స్ శాఖ రూ.89.91 కోట్ల జరిమానా విధించింది. 2024 మార్చి నుంచి 2025 ఫిబ్రవరి మధ్య సుమారు 113 కిలోల బంగారం దుబాయ్ నుంచి అక్రమంగా తరలించినట్లు 399 పేజీల ఆర్డర్‌లో పేర్కొంది. 2025 మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో 14.213 కిలోల బంగారంతో ఆమె పట్టుబడ్డారు. COFEPOSA కింద ఏడాది నిర్బంధం పూర్తయి విడుదలైనా కేసు విచారణ కొనసాగుతోంది.
రణ్యారావుకు రూ.89.91 కోట్ల కస్టమ్స్ జరిమానా
Source: Chitrajyothy