మాటలు, వినికిడి లోపం ఉన్న వీరాభిమాని గణేష్‌ను జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌కు పిలిపించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చేతికి గాయమై ఆర్మ్ స్లింగ్ ధరించిన తారక్, అభిమానిని పూర్తిగా హత్తుకునేందుకు ఆ కట్టు విప్పేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బొమ్మనకుంట గ్రామానికి చెందిన గణేష్, ‘దేవర’ సినిమాపై తన సైగలతో ఇచ్చిన ఎమోషనల్ వీడియో వైరల్ కావడంతో ఈ భేటీ జరిగింది.
చేతి కట్టు తీసి అభిమానిని హత్తుకున్న జూనియర్ ఎన్టీఆర్
Source: Chitrajyothy