ప్రముఖ దర్శక నిర్మాత బి. నర్సింగరావుకు హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. అక్టోబర్ 7న జరిగే 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా ఈ పట్టా అందజేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఆ రోజు 36,145 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు.
బి. నర్సింగరావుకు అంబేద్కర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
Source: Chitrajyothy