హాస్య దిగ్గజం అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అల్లు అర్జున్ తన నూతన క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను 'ఐకాన్జా' పేరుతో ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సినిమా కథా చర్చలు, కొత్త కాన్సెప్టుల డెవలప్‌మెంట్, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రణాళికల కోసం ఈ వర్క్‌స్పేస్‌ను ఆధునిక హంగులతో తీర్చిదిద్దినట్లు సమాచారం. 'పుష్ప 2' తర్వాత ఆయన రానున్న 'రాకా' సహా పలు ప్రాజెక్టుల పనులు ఇక్కడి నుంచి వేగవంతం కానున్నాయి.
తాత జయంతి వేళ అల్లు అర్జున్ కొత్త ఆఫీస్ 'ఐకాన్జా' ప్రారంభం
Source: Chitrajyothy