అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని బలంగా పిలుపునిచ్చారు. అమెరికా కంపెనీలు దేశీయ కార్మికులను చౌక విదేశీ కార్మికులతో భర్తీ చేయడానికి ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని పేర్కొన్న ఆయన, దీన్ని రద్దు చేయడానికి తాను పూర్తిగా మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాలను అత్యధికంగా పొందుతున్న భారతీయులపై ఈ ప్రకటన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
హెచ్-1బీ వీసాను రద్దు చేయాలని ఉపాధ్యక్షుడు వాన్స్ పిలుపు
Source: Gulte Telugu