నిరంతరం కూర్చుని పనిచేసే వారికి ప్రతి గంటకు 5 నిమిషాల నడక మేలు చేస్తుంది. ఇది రక్తప్రసరణ మెరుగుపరిచి, రక్తపోటు అదుపులో ఉంచి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే గ్లూకోజ్ నియంత్రణకు సహాయపడి టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నెముక, మెడ, నడుము నొప్పులను నివారించడంలోనూ ఇది ఉపయోగకరం.
గంటకో 5 నిమిషాల నడక ఆరోగ్యానికి అద్భుతం
Source: Vaartha