జపాన్‌లోని ఒకినావాలో 39 ఏళ్ల స్థానిక మహిళను హోటల్ గదిలో గొంతు నులిమి చంపి, ఆమె పర్సు, బ్యాక్‌ప్యాక్ దోచుకున్న ఆరోపణలపై 20 ఏళ్ల అమెరికా మెరైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఫుటెన్మా స్థావరంలో పనిచేసే నిందితుడు మూడో మెరైన్ ఎక్స్‌పెడిషనరీ ఫోర్స్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఒకినావా గవర్నర్, ప్రధాని తకాయిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అమెరికా సైనిక స్థావరాలపై స్థానికుల వ్యతిరేకత మరింత పెరిగింది.
ఒకినావాలో మహిళ హత్య: అమెరికా మెరైన్ అరెస్ట్
Source: Telugu Post