ఫ్రాన్స్‌లో విద్యకు నిధులు పెంచాలని ఉన్నత పాఠశాల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా దేశవ్యాప్తంగా 2.66 లక్షల మంది ర్యాలీల్లో పాల్గొన్నారు. పారిస్‌లో 56 వేల మంది నిరసన తెలిపారు. ర్యాలీ చివర్లో అల్లర్లు చెలరేగడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు వారాలుగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 6,500 మందికి పైగా అరెస్టయ్యారు.
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళన: 2.66 లక్షల మంది ర్యాలీలు, 500 అరెస్టులు
Source: Telugu Post