హైదరాబాద్ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాజెక్టులో ప్రభుత్వం పెద్ద మార్పు చేసింది. ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల ప్రణాళికను రద్దు చేసి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ముఫక్కంజా కళాశాల వరకు 4.3 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ట్రీ కటింగ్, భూ సేకరణ సమస్యలు, వన్-వే ట్రాఫిక్ విధానం ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సవరించిన ప్రాజెక్టు వ్యయం అదే ₹1,090 కోట్లుగా ఉండటంపై బీఆర్‌ఎస్ ప్రశ్నలు లేవనెత్తుతోంది.
కేబీఆర్ పార్క్ ప్రాజెక్టులో పునర్‌రూపకల్పన, ఫ్లైఓవర్లు రద్దు
Source: Gulte Telugu