బెంగళూరు బ్యాగ్లూర్ మెయిన్ రోడ్డులోని అమెజాన్ కార్యాలయం సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఒకరికి రెండు చేతులకు తీవ్ర కాలిన గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న పాఠశాల విద్యార్థిని తృటిలో సురక్షితంగా బయటపడింది. రద్దీ ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై ట్రాన్స్‌ఫార్మర్ ఉంచడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెంగళూరులో ఫుట్‌పాత్‌పై ట్రాన్స్‌ఫార్మర్ పేలి ఇద్దరికి గాయాలు
Source: Vaartha